కోల్‌కతా: అర్జెంటీనా 2022 ప్రపంచకప్ విజయం సందర్భంగా మెస్సీకి నివాళిగా ఈ విగ్రహాన్ని నిర్మించారు. 2025 డిసెంబర్‌లో (Lionel Messi Statue) జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మెస్సీ వర్చువల్‌గా దీనిని ఆవిష్కరించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
కోల్‌కతాలో ఫుట్‌బాల్‌కు ఉన్న ప్రత్యేక ఆదరణకు ఈ విగ్రహం ప్రతీకగా నిలుస్తుందని అభిమానులు భావించారు. అయితే ఆవిష్కరించిన కొద్ది నెలల్లోనే విగ్రహాన్ని తొలగించాల్సి రావడం చర్చనీయాంశంగా మారింది. నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విగ్రహాన్ని పూర్తిగా తొలగించడం కాకుండా ఎకో పార్క్ వంటి మరింత సురక్షిత ప్రాంతానికి తరలించే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక నిర్ణయం వెలువడలేదు.

