Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ఐక్య ధైర్య సేన సమితి' మొదలుపెట్టిన మంచు మనోజ్

'ఐక్య ధైర్య సేన సమితి' మొదలుపెట్టిన మంచు మనోజ్

maa gulf 1 week ago

హైదరాబాద్: మే 20న మంచు మనోజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా నేడు 'రా కింగ్' మనోజ్ మంచు, ఆయన భార్య భూమా మౌనిక కలిసి కూకట్‌పల్లి లో రక్తదాన శిబిరం నిర్వహించి తమ సామాజిక సేవా సంస్థ "ఐక్య ధైర్య సేన సమితి"ను అధికారికంగా ప్రకటించారు.

ఈ సంస్థ ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గెస్ట్ గా హాజరవగా వాలంటీర్లు, అభిమానులు పాల్గొన్నారు.

ఈ ఈవెంట్లో మనోజ్ మంచు మాట్లాడుతూ.. సమాజానికి అండగా నిలబడటం, సేవ చేయడం నేను, నా భార్య పెద్దల నుంచి నేర్చుకున్న విలువలు. ఇంతకుముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. అయితే అలంటి ఆలోచన కలిగిన వారందరికి ఒక వేదిక ఉండాలని ఈ ఐక్య ధైర్య సేన సమితిని ప్రారంభిస్తున్నాం. ఈ ఆలోచన నా భార్య నుంచే వచ్చింది. రక్తదాన శిబిరంతో పాటు, ఈరోజు నుంచే ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుని వారి విద్యకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ఈ సంస్థ సేవా కార్యక్రమాలను తీసుకెళ్తాం. ఈ సంస్థ ద్వారా ఎవరికైనా సహాయం అందితే అదే మా జీవితంలో గొప్ప విజయం అని అన్నారు.

మౌనిక భూమా మాట్లాడుతూ.. మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో నేను, మనోజ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మా తల్లిదండ్రుల ఆశీర్వాదాల వల్లే సాధ్యమైంది ఇది. ఈ ట్రస్ట్ కేవలం రక్తదాన కార్యక్రమాలకే పరిమితం కాదు. మహిళా సాధికారత, ఉపాధి కల్పన కోసం కూడా పని చేస్తుంది. అలాగే నమస్తే వరల్డ్ అనే సంస్థను ప్రారంభించి దాని ద్వారా టాయ్ మేకింగ్ కోర్సుల సహకారంతో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అని అన్నారు.

ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. మా కుటుంబం, మనోజ్ అన్న కుటుంబానికి 30 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. చిన్నప్పటి నుంచే ఆయనలో సేవా భావం ఉంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా మౌనిక భూమా గారి ఆలోచనతో ఈ ట్రస్ట్‌ను ప్రారంభించడం ఎంతో అభినందనీయం. ఈ ట్రస్ట్ పేరు 'ఐక్య ధైర్య సేన సమితి'. దీని నినాదం Unity, Courage, Service, Impact. ఆ పేరు వాళ్ల ఆలోచన, సేవా భావాన్ని ప్రతిబింబిస్తుంది. పిల్లలను దత్తత తీసుకోవడం, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి నిర్ణయాలు ఎంతో గొప్పవి. ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లేందుకు మనోజ్ అన్నకు నా పూర్తి సహకారం ఉంటుంది అని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu