Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా 'స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్-2026'

అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా 'స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్-2026'

maa gulf 15 hrs ago

ఆగస్టు 8న విజయవాడ హయత్ ప్లేస్‌లో ప్రతిష్ఠాత్మక అవార్డుల ప్రదానోత్సవం

మరావతి: సమాజంలోని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన తగిన గుర్తింపు పొందిన వ్యక్తులను వెలుగులోకి తీసుకురావడం, వారి సేవలను గౌరవించడం లక్ష్యంగా గ్లోబల్ ఐకాన్స్ ఫోరమ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక "స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్-2026" పోస్టర్‌ను రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శనివారం నాడు ఆయన కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ప్రతిభను గుర్తించి గౌరవించడం ద్వారా సమాజానికి స్ఫూర్తినిచ్చే వ్యక్తులను వెలుగులోకి తీసుకురావడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడంతో పాటు యువతకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.

అమరావతిలో ఇలాంటి జాతీయ స్థాయి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల రాజధాని ఖ్యాతి మరింత పెరుగుతుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తున్న అమరావతికి ఇవి మరింత గుర్తింపు తీసుకువస్తాయని తెలిపారు. దేశ విదేశాల్లో తెలుగు వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడంలో గ్లోబల్ ఐకాన్స్ ఫోరమ్ సొసైటీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.

అనంతరం గ్లోబల్ ఐకాన్స్ ఫోరమ్ సొసైటీ అధ్యక్షులు చైతన్య జంగా, జనరల్ సెక్రటరీ జయా పటేరియా మాట్లాడుతూ, దేశంలోని వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో తమ తమ రంగాల్లో విశిష్ట సేవలు అందించినప్పటికీ తగిన గుర్తింపు పొందని ప్రతిభావంతులను గుర్తించి, వారికి ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నట్లు"స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్-2026" ద్వారా గౌరవించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సమాజానికి విశిష్ట సేవలు అందించిన వారిని ప్రజల ముందుకు తీసుకువచ్చి, వారి సేవలకు తగిన గుర్తింపు కల్పించడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

విజయవాడలోని హయత్ ప్లేస్‌లో ఆగస్టు 8న నిర్వహించే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల మహోత్సవంలో ప్రముఖ రాజకీయ నాయకులు, మంత్రివర్యులు, సినీ ప్రముఖులు, వైద్యులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, సంఘసేవకులు, కళాకారులు మరియు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు "స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్-2026" ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి నైనా గంగూలీ ప్రత్యేక ఆకర్షణగా హాజరుకానుండగా, పలువురు విశిష్ట అతిథులు పాల్గొని అవార్డులను అందజేయనున్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, రాష్ట్ర పర్యాటక శాఖ మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ , బీజేపీ ఫోటో కాల్ చైర్మన్ పాతూరి నాగభూషణం, తెలుగు దేశం అధికార ప్రతినిధి గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్, గ్లోబల్ ఐకాన్స్ ఫోరమ్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ మిత్తాన ఈశ్వర్, జాయింట్ సెక్రటరీ కోడె శ్రీ చైతన్య, ట్రెజరర్ ఆర్.వి. అప్పారావు, కమిటీ సభ్యులు డాక్టర్ ఎ. నవీన్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu