Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'అన్‌మ్యూట్ విత్ సుమ'..పబ్లిక్ స్పీకింగ్ వర్క్‌షాప్ ప్రారంభించిన యాంకర్ సుమ

'అన్‌మ్యూట్ విత్ సుమ'..పబ్లిక్ స్పీకింగ్ వర్క్‌షాప్ ప్రారంభించిన యాంకర్ సుమ

maa gulf 18 hrs ago

'అన్‌మ్యూట్ విత్ సుమ'తో పబ్లిక్ స్పీకింగ్, సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్, కమ్యూనికేషన్ కోచింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తున్నాను. అందరికీ ఉపయోగపడేలా ప్రత్యేకమైన సిలబస్‌ను డిజైన్ చేశాం.

ధైర్యంగా మాట్లాడాలనుకునే ప్రతి ఒక్కరూ జనవరి 24న జరిగే వర్క్‌షాప్‌కు రిజిస్టర్ కావాలని కోరుకుంటున్నాను: ప్రెస్ మీట్‌లో యాంకర్ సుమ కనకాల

పబ్లిక్ స్పీకింగ్, సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్, ఇంపాక్ట్‌ఫుల్ కమ్యూనికేషన్‌లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలనుకునే వారి కోసం ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్రత్యేకంగా 'Unmute with Suma - ధైర్యంగా మాట్లాడండి' పేరుతో వన్ డే వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. స్కిల్ స్టూడియో ప్రో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జనవరి 24న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. పబ్లిక్ స్పీకింగ్, సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఈ వర్క్‌షాప్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్‌లో సుమ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. 'Unmute with Suma' వర్క్‌షాప్ వివరాలను తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. ఒక నటిగా, యాంకర్‌గా, నిర్మాతగా ఈ జర్నీలో మీరు నాకు ఎంతో ప్రేమను అందించారు. ఇవన్నీ కంటిన్యూ చేస్తూనే ఈరోజు నా జర్నీ ఒక కొత్త మలుపు తిరుగుతోంది. ఒక కోచ్‌గా, ఒక ట్రైనర్‌గా పబ్లిక్ స్పీకింగ్, సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్, ఇంపాక్ట్‌ఫుల్ కమ్యూనికేషన్ కోచింగ్ ప్రోగ్రామ్‌ను నేను మొదలుపెట్టబోతున్నాను. దాని పేరే 'Unmute with Suma - ధైర్యంగా మాట్లాడండి'.

దీన్ని ఇంగ్లీష్‌లో చేయాలా, తెలుగులో చేయాలా అని తర్జనభర్జన పడుతున్నప్పుడు, తెలుగులోనే మొదలుపెడదామని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే నాకు ఇంత ఇచ్చింది తెలుగే. ఈ కోర్సును జనవరి 24న ఒక వన్ డే వర్క్‌షాప్‌లా నిర్వహిస్తున్నాం.

ఈ కోర్సు ప్రారంభించడానికి కారణం ఏమిటంటే.. నన్ను ఎవరైనా కలిసినప్పుడు 'మీరు భలే ధైర్యంగా మాట్లాడుతారు. మీలాగా మాట్లాడటం ఎలా?' అని అడుగుతుంటారు. 'మాక్కూడా మాట్లాడాలని ఉంది. కానీ స్టేజ్ చూస్తే మాకు వణుకు పుడుతుంది. మాటలు రావడం లేదు. ధైర్యంగా మాట్లాడలేకపోతున్నాం' అని నాతో చెప్తుంటారు. 'మీరు ఏదైనా ఒక కోర్సు చేయొచ్చు కదా' అని కూడా అడుగుతుంటారు. చాలా సంవత్సరాలుగా 'అసలు నేను కోర్సు చేయడమేమిటి?' అని చెప్తూ వచ్చాను. కానీ ఈ సంవత్సరం ఎందుకో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇంతకాలం యాంకరింగ్ నాకు చాలా ఇచ్చింది. దీని ద్వారా నేను సమాజానికి తిరిగి ఏదైనా ఇవ్వాలి అనుకుంటున్నాను. దీనికోసం కొంతకాలం సమయం కేటాయించి సిలబస్‌ను రూపొందించడం జరిగింది.

నాకు మంచి స్పాంటేనియస్‌ వుంటుదని అంటున్నారు. అది వినడం వల్ల. అవతలి వాళ్లు ఏమంటున్నారో విని, దానికి నేను ఇచ్చే రియాక్షన్ స్పాంటేనియస్‌గా ఉంటుంది. మనం ఎప్పుడైతే వినగలుగుతామో అప్పుడే స్పందించగలుగుతాం. ఇలా ప్రతి విషయాన్నీ డీకోడ్ చేసుకుంటూ ఒక సిలబస్‌ను డిజైన్ చేయడం జరిగింది.

ఈ కోర్సు పాలిటిక్స్ అయినా, యాంకరింగ్ అయినా, వ్యాపారమైనా.. ఏ రంగంలో ఉన్నవారికైనా ఉపయోగపడుతుంది. ధైర్యంగా మాట్లాడాలనుకునేవారు, మనసులో ఉన్న భావాలను స్పష్టంగా చెప్పాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ కోర్సు వర్తిస్తుంది. నోటికొచ్చింది మాట్లాడటం కాదు.. మీరు మాట్లాడేది అందరూ వినాలనిపించేలా ఉండాలి. అలాంటి విధంగా ఈ కోర్సును డిజైన్ చేశాను.

మొదట ఆన్‌లైన్‌లో ఈ కోర్సును ప్రారంభించాను. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 300 మంది జాయిన్ అయ్యారు. చికాగో, ఆస్ట్రేలియా, అమెరికా ఇలా వివిధ దేశాల నుంచి జాయిన్ అయ్యారు. అలాగే 8 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు వయసున్నవారు కూడా ఆ కోర్సులో పాల్గొన్నారు. కానీ ఈసారి నేను చేయబోతున్న కోర్సు 18 సంవత్సరాలు దాటిన వారి కోసం. ఈసారి తెలుగులోనే చేయబోతున్నాం. ఆసక్తి ఉన్నవారు తప్పకుండా రిజిస్టర్ అవ్వండి. కచ్చితంగా ఈ కోర్సు మీ అందరికీ హెల్ప్ అవుతుంది.

ఈ జర్నీని మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంతకాలం మీరు నాకు సపోర్ట్ చేశారు. ఇకపై కూడా మీ అందరి సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధైర్యంగా మాట్లాడాలనుకునే అందరికీ ఈ కోర్సు వర్తిస్తుంది. నాకు తెలుగును ఇంత చక్కగా నేర్పించిన బ్నిం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు"

కార్టూనిస్ట్ బ్నిం మాట్లాడుతూ.. "నేను సుమ గారికి మాటలు నేర్పించాననేది కేవలం పుకారు మాత్రమే. నిజానికి నేను సుమ గారిలా మాట్లాడలేను. అందుకే ఈ వర్క్‌షాప్‌లో నేనే జాయిన్ అవుతాను.

రిజిస్ట్రేషన్ కోసం ఈ లింక్‌ను సందర్శించండి: https://skillstudiopro.sumafilmyarts.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu