అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSFTVTDC) కు కొత్త పాలకవర్గాన్ని నియమించింది.
ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
కార్పొరేషన్ ఛైర్మన్‌గా పి.భరత్ భూషణ్‌ను నియమించగా, వైస్ ఛైర్మన్‌గా ప్రముఖ దర్శకుడు చిక్కాల మెహర్ రమేష్ కుమార్‌ను నియమించారు. వీరితో పాటు మరో 14 మందిని డైరెక్టర్లుగా ప్రభుత్వం ఎంపిక చేసింది.
డైరెక్టర్లుగా నియమితులైన వారు
సుమన్ తల్వార్
ఎస్. శివాజీ
చదలవాడ శ్రీనివాసరావు
బుర్రా సాయిమాధవ్
వై. ఝాన్సీ
కూచిభొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద (వివేక్ కూచిభొట్ల)
వి. సముద్ర
కే. ఉమామహేశ్వర రావు
మీర్.ఎస్
కందిమళ్ల సాంబశివరావు
ఏ. సత్యనారాయణ
ఎస్. వెంకట కృష్ణారెడ్డి
జీ. రాజ్ వెంకటేశ్వర యాదవ్
డి. సత్యనారాయణ
సినీ, టెలివిజన్ మరియు థియేటర్ రంగాల అభివృద్ధికి ఈ కొత్త కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో సినీ పరిశ్రమకు ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొత్త ప్రతిభకు అవకాశాల కల్పన వంటి అంశాలపై కార్పొరేషన్ దృష్టి సారించనున్నట్లు సమాచారం.

