మనామా: డాక్టర్ ప్రదీప్ సింగ్ రాజ్‌పురోహిత్‌ను బహ్రెయిన్ కు భారత తదుపరి రాయబారిగా నియమించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ట్రినిడాడ్ మరియు టొబాగో కు భారత హైకమిషనర్‌గా పనిచేసిన డాక్టర్ రాజ్‌పురోహిత్, మనామాలో తన కొత్త బాధ్యతలను స్వీకరిస్తారని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
భారత్, బహ్రెయిన్ దేశాలు దీర్ఘకాలంగా దౌత్య, ఆర్థిక సంబంధాలను కలిగిఉన్నాయి. బహ్రెయిన్ లో నివసిస్తున్న పెద్ద సంఖ్యలో ఉన్న ఇండియన్ కమ్యూనిటీ వాణిజ్యం, పెట్టుబడులు, కాన్సులర్ వ్యవహారాలలో బలమైన సహకారం ఈ సంబంధాలకు మద్దతుగా నిలుస్తున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

