Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బహ్రెయిన్-కువైట్ భద్రతా సహకారం బలోపేతం..!!

బహ్రెయిన్-కువైట్ భద్రతా సహకారం బలోపేతం..!!

maa gulf 6 days ago

నామాః బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా కువైట్‌లో అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా బహ్రెయిన్ మరియు కువైట్ మధ్య భద్రతా సహకారం బలోపేతం కానుంది.

ఈ పర్యటన సందర్భంగా బహ్రెయిన్ మినిస్టర్.. కువైట్ క్రౌన్ ప్రిన్స్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-సబా మరియు తాత్కాలిక ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి ఫహద్ యూసుఫ్ సౌద్ అల్ సబాతో సమావేశమయ్యారు. ప్రాంతీయ పరిణామాలు మరియు ఉమ్మడి భద్రతా సమన్వయాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించారు.
ఈ చర్చలు, ఈ రెండు గల్ఫ్ దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక సంబంధాలను, ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి మరియు గల్ఫ్ భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడానికి ఉమ్మడి నిబద్ధతను తెలియజేశాయి. ప్రాంతీయ సవాళ్లను పరిష్కరించడానికి మరియు వివిధ భద్రతా రంగాలలో సహకారాన్ని మరింత అభివృద్ధి చేయడానికి గల్ఫ్ దేశాలు ఐక్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu