Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత్ నుంచి 5 దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

భారత్ నుంచి 5 దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

maa gulf 1 week ago

న్యూ ఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ నేటి (శుక్రవారం, మే 15) నుంచి అత్యంత కీలకమైన ఐదు దేశాల పర్యటనను ప్రారంభించారు.

6 రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో భాగంగా ఆయన యూఏఈతో పాటు నాలుగు ఐరోపా దేశాల్లో (నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ) పర్యటించనున్నారు.

పర్యటనలో భాగంగా మోదీ మొదట యూఏఈ రాజధాని అబుదాబి చేరుకుంటారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల కారణంగా 'హర్మూజ్ జలసంధి' మూతపడటం, ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకాలు కలగడం వంటి పరిణామాల మధ్య ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu