Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చార్లెట్‌లో 'NATS' ఉచిత వైద్య శిబిరం

చార్లెట్‌లో 'NATS' ఉచిత వైద్య శిబిరం

maa gulf 5 days ago

50 మందికి పైగా ఉచిత వైద్య సేవలు అమెరికా: అమెరికాలో భాషే రమ్యం..సేవే గమ్యం అంటూ సేవలందిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా చార్లెట్ చాప్టర్ ఆధ్వర్యంలో స్థానిక ప్రవాస తెలుగు వారి కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది.సమాజంలో ఆరోగ్య అవగాహనను పెంపొందించడం, నివారణోపాయాలపై సరైన మార్గదర్శకత్వం అందించడమే లక్ష్యంగా 'క్రిష్యా కేర్స్' వేదికగా ఈ శిబిరిం ఏర్పాటు చేశారు.ఈ శిబిరానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది., 50 మందికి పైగా రిజిస్టర్ చేసుకుని ఉచిత వైద్య సేవలను, సలహాలను పొందారు.

ఈ హెల్త్ క్యాంప్‌లో నలుగురు ప్రసిద్ధ నిపుణులైన వైద్యులు పాల్గొని తమ అమూల్యమైన సేవలను అందించారు. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ వినీత్ కొర్రపాటి, ఫ్యామిలీ ఫిజీషియన్ డాక్టర్ కిషన్ మరమరాజ్, కార్డియాలజిస్ట్ డాక్టర్ కార్తీక్ శఠగోపం, ఆంకాలజిస్ట్ డాక్టర్ గీతా వల్లభనేనిలు ఈ వైద్య శిబిరానికి విచ్చేసిన వారికి ఉచితంగా వైద్య సేవలు అందించారు. గుండె జబ్బులు, జీర్ణక్రియ సమస్యలు, క్యాన్సర్ నివారణోపాయాలతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎలా అలవర్చుకోవాలనే అంశాలపై రోగులకు వారు అమూల్యమైన సలహాలు, సూచనలు అందించారు. నిపుణులైన డాక్టర్లను నేరుగా కలిసి తమ ఆరోగ్య సమస్యలను నివృత్తి చేసుకునే అవకాశం కల్పించడంపై లబ్ధిదారులు 'నాట్స్' ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వైద్య శిబిరం కోసం నాట్స్ చార్లెట్ చాప్టర్ ఆర్గనైజింగ్ టీమ్, వాలంటీర్లు సమిష్టి కృషితో ఈ వైద్య శిబిరం విజయవంతమైంది. ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంప్ ప్లానింగ్, మేనేజ్‌మెంట్‌లను క్రమశిక్షణతో, సమర్థవంతంగా నిర్వహించడంలో యువ వాలంటీర్లు పోషించిన పాత్ర అభినందనీయం.వారి ఉత్సాహం, నిబద్ధత ఈ మెడికల్ క్యాంప్ విజయవంతం కావడానికి ఎంతగానో తోడ్పడ్డాయని నాట్స్ నాయకులు యువ వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు. సమాజ శ్రేయస్సు కోసం నిర్వహించిన ఈ బృహత్తర కార్యక్రమానికి సహకరించిన వైద్యులకు, వాలంటీర్లకు, స్పాన్సర్లకు నాట్స్ కృతజ్ఞతలు తెలిపింది. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు,నిర్వహణలో చొరవ చూపించిన చార్లెట్ చాప్టర్ నాట్స్ నాయకులను నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేకంగా అభినందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu