మచిలీపట్టణం: మచిలీపట్టణం నడిబొడ్డున స్థానిక జిల్లాకోర్టు సెంటరు నందు 2 ఎకరాల విస్తీర్ణంలో డా.భోగరాజు పట్టాభిసీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి కావలసిన ప్రభుత్వ అనుమతుల జారీకి నేడు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ విషయమై బందరు ఎంపీ బాలశౌరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకు మరియు ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కు మచిలీపట్టణం పార్లమెంట్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియచేసారు.
గతంలో మొదటి దశ నిర్మాణానికి కావలిసిన రూ.6.5 కోట్ల రూపాయలు గతంలోనే యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా వారు మంజూరు అయిన సంగతి విదితమే. అయితే ఈ నిర్మాణానికి అవసరమైన స్థలమునకు సంబంధిచి ప్రభుత్వం నుండి రావాల్సిన అనుమతులు రాకుండా గత ప్రభుత్వం అడ్డుకోవడంతో ఇంతకాలం జాప్యం ఏర్పడింది. నేడు జరిగిన క్యాబినెట్ సమావేశంలో అనుమతులు కూడా మంజూరు కావడంతో త్వరలోనే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి బందరుకు తలమానికంగా దీని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఎంపీ వెల్లడించారు.

