Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!

డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!

maa gulf 3 weeks ago

నామా: అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) ప్రచురించిన 2026 ఐసిటి అభివృద్ధి సూచిక (IDI)లో ప్రపంచవ్యాప్తంగా ఆరవ ర్యాంకు సాధించడం ద్వారా, డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.

గత ఏడాది ర్యాంకింగ్‌లతో పోలిస్తే మూడు స్థానాలు పైకి ఎగబాకింది. 98% మొత్తం స్కోరుతో 159 దేశాలలో ఆరవ స్థానాన్ని దక్కించుకుంది. తద్వారా తన టెలికమ్యూనికేషన్స్ మరియు డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మరో మైలురాయిని చేరుకుందని రవాణా మరియు టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి డాక్టర్ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా హర్షం వ్యక్తం చేశారు.

టెలికమ్యూనికేషన్లు మరియు సమాచార, కమ్యూనికేషన్ల సాంకేతికతలో ప్రపంచంలోని అగ్రగామి దేశాల సరసన బహ్రెయిన్ ను నిలబెట్టేందుకు, హీజ్ మెజెస్టీ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నాయకత్వంలో మరియు క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా నేతృత్వంలోని బహ్రెయిన్ సాధిస్తున్న నిరంతర పురోగతికి ఈ విజయం నిదర్శనమని అన్నారు.

టెలికమ్యూనికేషన్ సేవల నాణ్యతను పెంచడానికి బహ్రెయిన్ అనుసరించిన జాతీయ వ్యూహాల విజయానికి ఈ మెరుగైన ప్రపంచ ర్యాంకింగ్ నిదర్శనమని మంత్రి అన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్లనే బహ్రెయిన్ ఉన్నత-నాణ్యత గల టెలికమ్యూనికేషన్లు మరియు ఇంటర్నెట్ సేవలను అందించగలిగిందని, ఫిక్స్‌డ్ మరియు మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రిప్షన్‌లను పెంచుకోగలిగిందని, మరియు రాజ్యం అంతటా డిజిటల్ సేవల కవరేజీని, అందుబాటును విస్తరించగలిగిందని ఆయన వివరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu