Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దోహా మెట్రోలో జర్నీ టూవర్డ్ హెల్త్ ఈవెంట్..!!

దోహా మెట్రోలో జర్నీ టూవర్డ్ హెల్త్ ఈవెంట్..!!

maa gulf 1 week ago

దోహా: వరల్డ్ ఫ్యామిలీ డాక్టర్ డే ను పురస్కరించుకుని ఖతార్ రైల్వేస్, ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (PHCC) సహకారంతో మే 18 నుండి 19తేదీలలో దోహా మెట్రోలోని అల్ సద్ (Al Sadd) స్టేషన్‌లో "జర్నీ టూవర్డ్ హెల్త్ (Journey Toward Health)" మూడో ఎడిషన్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

దోహా మెట్రో నెట్‌వర్క్ అంతటా ప్రజలతో తమ అనుబంధాన్ని బలోపేతం చేసే వివిధ సామాజిక కార్యక్రమాలను అందించడమే ఈవెంట్ ప్రధాన లక్ష్యమని ప్రకటించింది. మెట్రో స్టేషన్లను వివిధ వర్గాల వారికి ఆకర్షణీయమైన కేంద్రాలుగా మరియు గమ్యస్థానాలుగా మార్చే నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఏడాది పొడవునా దోహా మెట్రో స్టేషన్లలో మెట్రో ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు.. ఇందులో భాగంగా వివిధ రకాల పబ్లిక్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

జర్నీ టూవర్డ్ హెల్త్ ఈవెంట్ లో ప్రజలకు ఉచిత వైద్య సంప్రదింపులు మరియు పరీక్షలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా, వినియోగదారులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేలా ప్రోత్సహించడానికి ఆసక్తికరమైన కార్యకలాపాలు, బహుమతులు మరియు అవగాహన పుస్తకాల పంపిణీ కూడా ఇందులో ఉందని తెలిపారు. అలాగే, మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం ఎడిషన్‌లో మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వైద్య సంప్రదింపులను కూడా అందించనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu