Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దుబాయ్ జనాభా 47.41 లక్షలు..1.61 లక్షల మంది కొత్త నివాసితులు..!!

దుబాయ్ జనాభా 47.41 లక్షలు..1.61 లక్షల మంది కొత్త నివాసితులు..!!

maa gulf 1 week ago

దుబాయ్: దుబాయ్ జనాభా వేగంగా పెరుగుతోంది. 2026లో ఇప్పటివరకు 1,61,335 మంది కొత్త నివాసితులు చేరడంతో ఎమిరేట్ జనాభా 47,41,335 (47.41 లక్షలు) దాటినట్లు దుబాయ్ పాపులేషన్ క్లాక్ తాజా గణాంకాలు వెల్లడించాయి.

2025 చివరి నాటికి దుబాయ్ జనాభా 45.80 లక్షలు ఉండగా, 2026లో ఏడు నెలల్లోనే మరో 1.61 లక్షల మంది కొత్తగా చేరారు. ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు దుబాయ్‌ను వీడుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఈ గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

దుబాయ్‌లో కనీసం ఆరు నెలలుగా నివసిస్తున్న లేదా అంతకాలం ఉండే ఉద్దేశంతో ఉన్న వారినే అధికారిక నివాసితులుగా ఈ లెక్కల్లో పరిగణించారు. 2025 గణాంకాల ప్రకారం 30-34 ఏళ్ల వయస్సు కలిగినవారే దుబాయ్‌లో అత్యధికంగా ఉన్నారు. వీరు మొత్తం జనాభాలో 15.45 శాతం వాటా కలిగి ఉండటం, దుబాయ్‌లో ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉందని సూచిస్తోంది.

పగటి వేళల్లో 63.92 లక్షల మంది పగటి సమయంలో దుబాయ్‌లో ఉండే మొత్తం జనాభా సగటున 63.92 లక్షలకు చేరుతోంది. ఇందులో శాశ్వత నివాసితులతో పాటు సుమారు 18.12 లక్షల మంది ఉద్యోగులు, పర్యాటకులు, విద్యార్థులు, షాపింగ్ కోసం వచ్చిన సందర్శకులు తదితరులు ఉంటారు.ఈ అదనపు పగటి జనాభా శాశ్వత నివాసితుల సంఖ్యలో దాదాపు 40 శాతం ఉండటంతో రహదారులు, ప్రజా రవాణా, ఆరోగ్య సేవలు, విద్య, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

దుబాయ్ పాపులేషన్ నౌ పేరుతో అమలు చేస్తున్న రియల్‌టైమ్ జనాభా లెక్కల విధానంలో ప్రభుత్వ డేటాబేస్‌లు, స్మార్ట్ సిస్టమ్‌లు, ఏఐ, మెషిన్ లెర్నింగ్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ సాయంతో జనాభా వివరాలను నిరంతరం అప్డేట్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu