- గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం పై అధ్యయనం చేయనున్న కమిటీ
విజయవాడ: గల్ఫ్ ఎన్నారై పాలసీ రూపకల్పన కొరకు తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ సభ్యుల బృందానికి గురువారం (21.05.2026) విజయవాడ విమానాశ్రయంలో ఏపీ ప్రభుత్వ ప్రోటోకాల్ సిబ్బంది స్వాగతం పలికారు.
హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న బృందంలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అనిల్ ఈరవత్రి ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, మెంబర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డిలు వారికి ఏయిర్ పోర్టులో స్వాగతం పలికారు.

