తాజా వార్తలు
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 'స్మార్ట్ ట్రాలీలు'

స్మార్ట్ ట్రాలీల అవసరం ఏమిటి?
ఎయిర్ పోర్టులో ట్రాలీ అవసరాలు చాలా వేగంగా మారుతుంటాయి. విమానాశ్రయంలో ప్రధానంగా రెండు చోట్ల ట్రాలీల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది - ఒకటి డిపార్చర్ ర్యాంప్ వద్ద, రెండోది అరైవల్స్ వద్ద ఉన్న బ్యాగేజ్ బెల్టుల వద్ద. IATA (అంతర్జాతీయ వాయు రవాణా సంస్థ) ప్రకారం, ఏ విమానాశ్రయంలోనైనా ప్రతి మిలియన్ ప్యాసింజర్లకు కనీసం 160 ట్రాలీలు అందుబాటులో ఉండాలి.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభిస్తున్న స్మార్ట్ ట్రాలీ మేనేజ్మెంట్ ద్వారా ట్రాలీలను అవసరమైన చోటికి, సరైన సమయంలో తరలించవచ్చు. ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల ట్రాలీలు విమానాశ్రయం సరిహద్దులను దాటే అవకాశాలను కూడా అడ్డుకోవచ్చు.
ప్రయోజనాలు
దీనిపై ఎస్‌జీకే కిషోర్, ఈడీ-సౌత్ మరియు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్, "ఆవిష్కరణ, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పుడూ ముందుంటుంది. విమానాశ్రయ సేవలు, కార్యాచరణ నైపుణ్యాన్ని పెంచడానికి మేము అనేక వినూత్న డిజిటల్ పరిష్కారాలను కనుగొంటున్నాము. దేశీయ, అంతర్జాతీయ ఇ-బోర్డింగ్; ఫేస్ రికగ్నిషన్ ట్రయల్స్ వంటి విజయవంతమైన ప్రాజెక్టుల తరువాత, ప్రయాణీకుల అనుభవాన్ని పెంచడానికి, విమానాశ్రయ కార్యకలాపాలు నిరాటంకంగా సాగటానికి బ్యాగేజీ ట్రాలీల నిర్వహణ విధానంలో విప్లవాత్మక మార్పులు చేస్తున్నాము.'' అన్నారు.