Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు

హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు

maa gulf 4 months ago

అబూధాబి: హిజ్రీ నూతన సంవత్సరం (1448) సందర్భంగా 2026 జూన్ 15, సోమవారం యూఏఈలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగులకు అధికారిక సెలవుగా ప్రకటించారు.

ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ (MOHRE) సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి.

యూఏఈ కేబినెట్ ఆమోదించిన 2026 అధికారిక సెలవుల జాబితా ప్రకారం ఈ సెలవు ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. సాధారణ కార్యాలయ పనులు జూన్ 16, మంగళవారం నుంచి తిరిగి ప్రారంభమవుతాయి.

సెలవు సోమవారం రావడంతో శని, ఆదివారాలు వారాంతపు సెలవులు ఉండే ఉద్యోగులకు మూడు రోజుల లాంగ్ వీకెండ్ లభించనుంది. ఇక షార్జాలో నాలుగు రోజుల పని విధానం అమలులో ఉండటంతో, శుక్రవారం, శనివారం, ఆదివారం ఇప్పటికే సెలవులు పొందే ప్రభుత్వ ఉద్యోగులు మరియు విద్యార్థులకు ఈసారి నాలుగు రోజుల విరామం లభించనుంది.

ఇటీవలే ఈద్ అల్ అదా సందర్భంగా యూఏఈలో ఈ ఏడాది ఎక్కువ సెలవులు లభించాయి. ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం తొమ్మిది రోజుల విరామం, ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఆరు రోజుల సెలవు పొందిన అనంతరం మరోసారి దీర్ఘ విరామం లభించనుంది.

ఇస్లామిక్ నూతన సంవత్సరం లేదా హిజ్రీ నూతన సంవత్సరం ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్ ప్రారంభాన్ని సూచిస్తుంది. హిజ్రీ క్యాలెండర్‌లో తొలి నెల అయిన ముహర్రం మొదటి రోజున ఈ పర్వదినం జరుపుకుంటారు. చంద్ర దర్శనం ఆధారంగా ఈ తేదీని అధికారికంగా నిర్ణయిస్తారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu