Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IPL ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

IPL ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

maa gulf 3 days ago

హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా శుక్రవారం జరగనున్న IPL క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో నగరవాసులకు ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు సంస్థ, తీపి కబురు అందించింది.

స్టేడియంలో మ్యాచ్ ముగిసిన తర్వాత అర్ధరాత్రి అభిమానులు ఎటువంటి రవాణా ఇబ్బందులు పడకుండా ఇళ్లకు చేరుకునేందుకు వీలుగా మెట్రో రైలు సేవలను అర్ధరాత్రి 12:00 గంటల వరకు పొడిగిస్తున్నట్లు మెట్రో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.

సాధారణ రోజుల్లో మెట్రో రైళ్లు రాత్రి 11:00 గంటల వరకే అందుబాటులో ఉంటాయి. అయితే శుక్రవారం మ్యాచ్ ముగిసే సమయానికి రద్దీ విపరీతంగా ఉంటుంది కాబట్టి, ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు సర్వీసులను నడపనున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత స్టేడియానికి సమీపంలో ఉండే ఉప్పల్ స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ, మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికులు రైలు ఎక్కవచ్చు. ఇక్కడి నుంచి మెట్రో నెట్‌వర్క్‌లోని అన్ని కారిడార్లలో ఉన్న ఏ స్టేషన్‌కైనా వెళ్లేందుకు ప్రయాణ సదుపాయం కల్పించారు.

స్టేడియం నుంచి బయటకు వచ్చే జనం రద్దీని మరియు ప్రయాణికుల అవసరాలను బట్టి ఉప్పల్ నుంచి నాగోల్, అమీర్‌పేట, మియాపూర్, జేబీఎస్ రూట్లలో ప్రత్యేకంగా అదనపు రైళ్లను నడపనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. మ్యాచ్‌కు వెళ్లే వారు ట్రాఫిక్ ఇబ్బందులు, పార్కింగ్ తలనొప్పులు లేకుండా ఉండేందుకు సొంత వాహనాలకు బదులు మెట్రో సేవలను వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సైతం సూచిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu