మనామా: ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఐక్య అరబ్ పార్లమెంటరీ వైఖరి కోసం బహ్రెయిన్ పార్లమెంటరీ గ్రూప్ పిలుపునిచ్చింది. మొరాకోలో జరిగిన అరబ్ స్కౌట్ యూనియన్ సమావేశంలో ఆ గ్రూప్‌లోని సభ్యుడైన ఎంపీ జలాల్ కధేమ్ ఈ మేరకు స్పష్టం చేశారు.
మహారాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నాయకత్వంలో యువరాజు, ప్రధానమంత్రి అయిన మహారాజు సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా మార్గదర్శకత్వంలో.. బహ్రెయిన్ ఉమ్మడి అరబ్ కార్యాచరణను బలోపేతం చేయడానికి కృషి చేసిందని అన్నారు. మొరాకోలో జరిగిన అరబ్ స్కౌట్ యూనియన్ ఫర్ పార్లమెంటేరియన్స్ 18వ జనరల్ అసెంబ్లీ సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
జీసీసీ దేశాల అంతర్గత వ్యవహారాలలో ఇరాన్ జోక్యానికి వ్యతిరేకంగా ఐక్య వైఖరి కోసం మద్దతు కూడగట్టడానికి, బహ్రెయిన్ శాసనసభ పార్లమెంటరీ గ్రూప్, అంతర్జాతీయ సమావేశాలలో తనకున్న స్థానాన్ని ఉపయోగించుకుంటోందని మిస్టర్ కధేమ్ అన్నారు.

