దోహా: ఖతార్‌లోని కొన్ని ఆరోగ్య కేంద్రాలలో జనన, మరణ నమోదు విభాగానికి సంబంధించిన అధికారిక పని వేళలను ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) ప్రకటించింది.
ఉదయం షిఫ్టు ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో జనన నమోదు దరఖాస్తులను మరియు జనన ధృవీకరణ పత్రాల అభ్యర్థనలను ఈ విభాగం స్వీకరిస్తుందని సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. ఈ సేవలు ఉమెన్స్ వెల్‌నెస్ అండ్ రీసెర్చ్ సెంటర్, అల్ వక్రా హాస్పిటల్, ఆయిషా బింత్ హమద్ అల్ అత్తియా హాస్పిటల్, ది క్యూబన్ హాస్పిటల్, సిద్రా మెడిసిన్, అల్ అహ్లి హాస్పిటల్, దోహా క్లినిక్ హాస్పిటల్ మరియు అల్ ఎమాడి హాస్పిటల్ ఉంటుంది.
సాయంత్రం పనివేళలు మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 6:30 వరకు ఉంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉమెన్స్ వెల్‌నెస్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో మాత్రమే సాయంత్రం ఫిష్ట్ అందుబాటులో ఉందని తెలిపారు.

