Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!

జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!

maa gulf 2 weeks ago

నామా: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) సభ్య దేశాల ఆరోగ్య మంత్రిత్వ శాఖల అండర్ సెక్రటరీల 12వ సన్నాహక సమావేశం బహ్రెయిన్ లో జరిగింది. జీసీసీ 46వ సమావేశానికి బహ్రెయిన్ అధ్యక్షత వహిస్తున్నది.

బహ్రెయిన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ లుల్వా రషీద్ ష్వైటర్ మనామాలో జరిగిన ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. జీసీసీ ఆరోగ్య మంత్రుల సమావేశానికి ముందు చేపట్టాల్సిన సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ఈ భేటీ జరిగింది. ఉమ్మడి గల్ఫ్ సహకారాన్ని బలోపేతం చేయడంలో జీసీసీ జనరల్ సెక్రటేరియట్‌తో పాటు సభ్య దేశాలు చేస్తున్న కృషిని డాక్టర్ లుల్వా రషీద్ ష్వైటర్ ప్రశంసించారు.

జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంలో ఇటువంటి సమావేశాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె అన్నారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, వైద్య సేవల నాణ్యత, సామర్థ్యాన్ని నిరంతరం మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జీసీసీ దేశాలు పెట్టుకున్న లక్ష్యాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆరోగ్య రంగంలో సంయుక్తంగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఆమె వివరించారు.

ఈ సమావేశంలో జీసీసీ ఆరోగ్య రంగానికి సంబంధించిన అజెండాలోని పలు అంశాలను సమీక్షించారు. ఆయా అంశాలపై ఇప్పటివరకు సాధించిన పురోగతిపై చర్చించారు. అలాగే సాంకేతిక కమిటీలు, ఉమ్మడి వర్కింగ్ టీమ్‌లు చేసిన సిఫార్సులను కూడా సమావేశంలో పరిశీలించారు. రాబోయే జీసీసీ ఆరోగ్య మంత్రుల సమావేశానికి సమర్పించేందుకు అవసరమైన ముసాయిదా నిర్ణయాలు, సిఫార్సుల తయారీపై కూడా ప్రధానంగా చర్చ జరిగింది.

గల్ఫ్ దేశాల మధ్య ఆరోగ్య రంగ సహకారాన్ని మరింత విస్తరించడం, వైద్య సేవల ప్రమాణాలను పెంచడం, ఆరోగ్య వ్యవస్థలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ సన్నాహక సమావేశం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu