Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'కాక్రోచ్ జనతా పార్టీ'.. అసలు ఎలా ప్రారంభమైంది?

'కాక్రోచ్ జనతా పార్టీ'.. అసలు ఎలా ప్రారంభమైంది?

maa gulf 3 days ago

న్యూ ఢిల్లీ: ఇటీవల సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా నిరుద్యోగ యువతను ఉద్దేశించి 'కాక్రోచ్' (బొద్దింకలు), 'పారాసైట్స్' (పరాన్నజీవులు) అనే పదాలు వాడారంటూ సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

ఈ వ్యాఖ్యలకు మహారాష్ట్రకు చెందిన అభిజీత్ దిప్కే అనే యువకుడు సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చాడు. మే 16న ట్విట్టర్ వేదికగా 'కాక్రోచ్ జనతా పార్టీ'ని ప్రకటిస్తూ, నిరుద్యోగ యువత కోసం ఈ సరికొత్త ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించినట్లు వెల్లడించాడు. డిజిటల్ యుగంలో బతుకుతున్న 'జెన్ జీ' (Gen Z) యువత ఆగ్రహం నుంచే ఈ వెరైటీ పార్టీ పుట్టింది.

ఈ పార్టీలో చేరడానికి వింత అర్హతలు..
ఈ పార్టీలో చేరడానికి అర్హతలు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాయి. "నిరుద్యోగి అయి ఉండాలి, బద్ధకస్తుడై ఉండాలి, 24 గంటలు ఆన్‌లైన్‌లో ఉంటూ సామాజిక అంశాలపై గొడవపడగలిగే సామర్థ్యం ఉండాలి" అంటూ ఆయన పెట్టిన కండిషన్స్ నెట్టింట నవ్వులు పూయిస్తున్నాయి. అయితే, దీనిని యువత చాలా సీరియస్‌గా తీసుకుంది. పార్టీ వెబ్‌సైట్, గూగుల్ ఫామ్ ద్వారా మెంబర్‌షిప్ ప్రారంభించిన మొదటి 48 గంటల్లోనే 40 వేల మందికి పైగా చేరగా.. కేవలం 72 గంటల్లోనే ఈ సంఖ్య ఏకంగా 1 లక్ష దాటిపోయింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డు స్థాయిలో ఫాలోవర్స్ ఈ పార్టీకి సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ పార్టీ ఊపు వేరే లెవెల్‌లో ఉంది. కేవలం రెండు రోజుల్లోనే దాదాపు 37 లక్షల మంది ఫాలోవర్లు ఈ పేజీని ఫాలో అవ్వడం విశేషం. అటు ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌పై కూడా కేవలం రెండు రోజుల్లోనే ఫాలోవర్ల సంఖ్య 50 వేలు దాటిపోయింది. ఇది అసలైన పొలిటికల్ పార్టీనా లేక సోషల్ మీడియాలో కేవలం సెటైరికల్ పార్టీనా అన్నది పక్కన పెడితే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలుస్తూ అంతటా చర్చనీయాంశంగా మారింది.

అసలు ఎవరీ అభిజీత్ దిప్కే?
ఈ కాక్రోచ్ పార్టీని లీడ్ చేస్తున్న అభిజీత్ దీప్కే ప్రస్తుతం బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. ఉన్నట్లుండి ఈ కొత్త పార్టీ ఎలా పుట్టింది? వెరైటీగా బొద్దింకల జనతా పార్టీ అని పేరెందుకు పెట్టారు? ఎవర్ని టార్గెట్ చేస్తున్నారు? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. విదేశాల్లో చదువుకుంటున్న అభిజీత్.. డిజిటల్ వేదికగా భారతీయ యువతను ఏకం చేస్తూ నడుపుతున్న ఈ సరికొత్త పొలిటికల్ గేమ్, దేశంలో 'జెన్ జీ' లీడ్ చేసే సరికొత్త నిరుద్యోగ ఉద్యమానికి దారి తీస్తోందా? అనే చర్చ ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu