Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాన్సాస్ నగరంలో డా.మాగంటి మురళీ మోహన్‌కు సువర్ణ సత్కారం

కాన్సాస్ నగరంలో డా.మాగంటి మురళీ మోహన్‌కు సువర్ణ సత్కారం

maa gulf 4 days ago

జీవితంలో క్రమశిక్షణ చాలా ముఖ్యం: మురళీమోహన్ కాన్సస్: జీవితంలో క్రమశిక్షణ, కృషి, సేవాభావం ఎంత ముఖ్యమని పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ నటులు మురళీ మోహన్ అన్నారు.

జీవితంలో ఎదగడానికి స్వీయ క్రమశిక్షణ ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలన్నారు. అమెరికాలోని కాన్సస్ నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్), తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (టాగ్ కేసి) సంయుక్తంగా డాక్టర్ మాగంటి మురళీ మోహన్‌కు సువర్ణ సత్కారం కార్యక్రమాన్ని నిర్వహించాయి.ఈ సందర్భరంగా మురళీ మోహన్‌ తన జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు.. అనుభవాలను హృదయానికి హత్తుకునేలా వివరించారు. ముఖ్యంగా అమెరికాలో పెరుగుతున్న తెలుగు పిల్లలకు మాతృభాష, తెలుగు సంస్కృతి, సంప్రదాయ జీవన విధానం పట్ల అవగాహన కల్పించడం ఎంతో అవసరమని మురళీ మోహన్ పేర్కొన్నారు. పిల్లలను సిలికానాంధ్ర మనబడి కార్యక్రమంలో చేర్పించి మాతృభాష తెలుగును నేర్పించాలని, తెలుగు సంస్కృతి మూలాలను తదుపరి తరాలకు అందించాలని ఆయన ప్రవాసాంద్రులకు ప్రత్యేకంగా పిలుపునిచ్చారు.

మురళీమోహన్‌లోని వ్యాపార నిపుణత, క్రమశిక్షణ, ప్రజాసేవ పట్ల అంకితభావం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల అన్నారు. ఇదే క్రమంలో డల్లాస్ నగరంలో జరగబోయే మహాసభలకు అందరినీ ఆహ్వానించారు. మురళీ మోహన్ వివిధ రంగాల చేసిన టాగ్ కేసి చైర్మన్ సరిత ఏడ్మా ప్రశంసించారు.అమెరికాలో తెలుగు సంస్థల తరఫున, తెలుగు సమాజం తరఫున ఆమె అభినందనలు తెలిపారు.
మురళీ మోహన్ సత్కార వేడుకకు తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. ఈ సత్కార వేడుకకు ముందు సభ ప్రారంభానికి ముందు స్థానిక హిందూ దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్య డా.మురళీ మోహన్‌ కి ఆలయ మర్యాదలతో, సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.ఆలయ విశేషాలను వివరించి దేవాలయాన్ని చూపించారు.

తెలుగు సినీ రంగంలో మురళీ మోహన్ విశిష్ట నటన, నిర్మాతగా సాధించిన విజయాలను ఈ సత్కార వేడుకలో సభికులు గుర్తు చేశారు. అలాగే ప్రజా సేవలో తన నిబద్ధతతో కోట్లాది అభిమానుల మనసుల్లో మురళీ మోహన్ స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం మురళీమోహన్‌ని గుర్తించడం యావత్ తెలుగు సమాజానికి గర్వకారణమని ఈ సభలో వక్తలు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి నాట్స్ నిర్వహణ మండలి సభ్యులు విజయ్ వర్మ కొండ, డా. మురళీ మోహన్ కుమార్తె మధుబిందు, అల్లుడు తుమ్మల రంగారావుతో ఇతర కుటుంబ సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాట్స్ జాతీయ నాయకులు రవి గుమ్మడిపూడి, వెంకట్ మంత్రి, నాట్స్ కాన్సాస్ విభాగ సమన్వయకర్త ప్రసాద్ ఇసుకపల్లి, సంయుక్త సమన్వయకర్త చైతన్య ద్యావనపల్లి పాల్గొన్నారు. టాగ్ కేసి చైర్మన్ సరిత ఏడ్మా, కార్యదర్శి శ్రీనివాసుల రెడ్డి చెవూరు, అధ్యక్షులు మధు గంట, ఉపాధ్యక్షురాలు సరిత రాయన్నగారి, తదితర స్థానిక ప్రముఖులు ఇతర సభ్యులు మురళీ మోహన్ సత్కారంలో పాలుపంచుకున్నారు.

ఈ కార్యక్రమానికి శ్రీవిద్య ఇసుకపల్లి, సొనాలికా పడాల వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. చైతాలిక మంత్రి గణేశ స్తోత్రంతో సభను ఆధ్యాత్మికంగా ప్రారంభించారు., చైతన్య ద్యావనపల్లి గారు డా. మురళీ మోహన్ జీవిత విశేషాలు, సాధించిన విజయాలు, సేవా కార్యక్రమాలను సభకు పరిచయం చేశారు. పలువురు సినీ ప్రముఖులు, నాయకులు దృశ్య సందేశాల ద్వారా మురళీ మోహన్ కి తమ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ వేడుకలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విశ్వమోహన్ అమ్ముల, నిధి రావు, శ్రీవిద్య ఇసుకపల్లి గారి సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. అలాగే మంజుల చిట్టెంపల్లి విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం, సొనాలికా పడాల గారి "మహా నటి" ఏకపాత్రాభినయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమం సాకారం కావటానికి ప్రధాన భూమిక పోషించి, రెండు తెలుగు సంస్థలను ఒక త్రాటిపై తీసుకువచ్చి, కార్యక్రమాన్ని మధుర జ్ఞాపకంగా మలిచిన వెంకట్ మంత్రి, వెంకటేష్ రావు చదలవాడ, సరిత ఏడ్మా, మధు గంటలను పలువురు ప్రత్యేకంగా అభినందించారు. నాట్స్ కార్యవర్గ సభ్యులు శ్రీవిద్య ఇసుకపల్లి, మదన్ సానె, సౌజన్య రావు, సాయిరామ్ గండ్రోతుల, విజయ్ రంగిణి, భారతి రెడ్డి, వేణు గారా, శ్రీనివాస్ దామా, గిరి చుండూరు, శ్రీనివాస్ అబ్బూరి, నాగార్జున రెడ్డి, రమణ కారే, నిఖిల్, అలాగే టాగ్ కేసి నిర్వహణ మండలి సభ్యులు డా. రాజా గోపాల్ రంగినేని, చంద్ర యక్కలి, దివాకర్ చెన్నారెడ్డి, కార్యవర్గ సభ్యులు ఫణికుమార్ కాశిరెడ్డి, సురేష్ తుమ్మల, విజయ్ కొండి, ప్రవల్లిక హేమంత్ వట్టెం, యమున కళువల్పల్లి, అనిత బెల్లంకొండ, దినేష్ రాయబారపు, ఉదయ్ కుమార్ అడుడొడ్ల, గౌతమ్ నల్లూరి, అరవింద్ పెంటపాటి, ఉమాకాంత్ పార్సి, తిరుమల కుమార్ ముద్దన, స్వరూప్ కుండేటి, శ్రీధర్ అమ్మిరెడ్డి, నరేంద్ర దుద్దెల, భార్గవ్, శ్రీనివాస్ పెనుగొండ, పాండు రంగారావు తదితరులు సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వీరికి తోడుగా సిలికానాంధ్ర మనబడి కాన్సాస్ ప్రతినిధులు రత్నేశ్వర్ మర్రె, శ్రీనివాస్ దామా, శ్రీదేవి గొబ్బూరితో పాటు వారి బృందం కూడా పాల్గొని మురళీ మోహన్ అభినందించారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు విశేష సహకారం అందించిన ప్రాయోజకులు స్టాఫింగ్ ట్రీ సంస్థ, మంత్రి సంస్థ, అట్‌మోస్ట్ కృత్రిమ మేధస్సు సంస్థ, భారతి రెడ్డి భూనివాస నిపుణులు, గిరి చుండూరు, రత్నేశ్వర్ మర్రెలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే భోజన ప్రాయోజకులు బావర్చి, దేశీ బైట్స్, చాయ్ కేఫే, హ్యాష్‌ట్యాగ్ ఇండియా, టచ్ ఆఫ్ ఏషియా, రాజధాని, యువ ఈట్స్, సహకారం అందించిన సరిత రాయన్న మిత్రబృందం, భార్గవ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. విజయ్ అయినాపురపు, సూర్య రాయరావుల ఛాయాచిత్ర మరియు దృశ్యచిత్ర సేవలు, హేమంత్ రూపొందించిన ప్రత్యేక చిత్రాల అలంకరణ వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రంగస్థల సహాయక బృందం, కళాకారులు, స్వచ్ఛంద సేవకులు, దాతలు, వేదికను అందించిన కాన్సాస్ హిందూ దేవాలయ సాంస్కృతిక కేంద్ర ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. చివరగా టాగ్ కేసి కార్యవర్గ కార్యదర్శి చందన తియాగూర వందన సమర్పణతో ఈ ఘనమైన సత్కార మహోత్సవం మంగళప్రదంగా ముగిసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu