Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేరళ నూతన ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌ ప్రమాణస్వీకారం

కేరళ నూతన ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌ ప్రమాణస్వీకారం

maa gulf 6 days ago

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. యూడీఎఫ్ కూటమి విజయం సాధించడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీడీ సతీశన్‌ కేరళ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

తిరువనంతపురంలోని సెంట్రల్‌ స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌.. వీడీ సతీశన్‌తో సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ వేడుకకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ,తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితర ప్రముఖులు హాజరై నూతన ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu