దోహా: ఖతార్ తీరాలకు ఆయిల్ కాలుష్యం చేరిందంటూ ప్రచారమవుతున్న వార్తలు అవాస్తవమని ఖతార్ ప్రభుత్వ కమ్యూనికేషన్ల కార్యాలయం (GCO) స్పష్టం చేసింది.
ఈ మేరకు తమ సోషల్ మీడియా వేదికల ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షణ కార్యకలాపాలు మరియు క్షేత్ర స్థాయి తనిఖీలు కొనసాగుతున్నాయని కమ్యూనికేషన్ల కార్యాలయం పేర్కొంది. అధికారిక వనరుల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, పుకార్లు లేదా ధృవీకరించని వార్తలను నమ్మొద్దని, అలాగే ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేసింది.

