దోహా: ఖతార్ ప్రధాని మరియు విదేశాంగ మంత్రి షేఖ్ మొహమ్మద్ బిన్ అబ్దురహ్మాన్ బిన్ జాసిం అల్-థానీ, భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్‌తో సమావేశమయ్యారు.
జైశంకర్ అధికారిక పర్యటనలో భాగంగా ఖతార్‌కు చేరుకున్నారు. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ముఖ్యంగా ఆర్థిక రంగంలో సహకారాన్ని విస్తరించడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. అలాగే ప్రాంతీయ పరిణామాలు, వాటి ప్రభావం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై మరియు ఇంధన మార్కెట్లపై ఎలా పడుతోందనే విషయాలను కూడా ఇరుపక్షాలు సమీక్షించాయి. వివాదాలు మరియు ఘర్షణలను చర్చల ద్వారా, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించడం అత్యంత ముఖ్యమని ఇరుపక్షాలు అభిప్రాయపడ్డాయి. ఇది ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో శాంతి, భద్రతను బలోపేతం చేయడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఖతార్ మరియు భారత్ మధ్య కీలక అంశాల పై సహకారాన్ని మరింత పెంచేందుకు సంయుక్త వర్కింగ్ మెకానిజమ్స్ మరియు ద్వైపాక్షిక కమిటీలను మరింత చురుకుగా చేయాలని ఇరుదేశాలు అంగీకరించాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి)

