Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కువైట్‌లో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ ఆపరేషన్ భగ్నం..!!

కువైట్‌లో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ ఆపరేషన్ భగ్నం..!!

maa gulf 3 weeks ago

కువైట్ : కువైట్‌లో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డ్రగ్స్‌ ఆపరేషన్‌ను అధికారులు భగ్నం చేశారు. 'లారికా' పేరుతో మాదకద్రవ్యాల తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించి పలువురు అనుమానితులను అరెస్ట్ చేశారు.

డిప్యూటీ ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబాహ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో నార్కోటిక్స్ కంట్రోల్ విభాగం ఈ ఆపరేషన్ చేపట్టింది.

అధికారుల వివరాల ప్రకారం.. దాదాపు 5 టన్నుల లారికా రా పౌడర్, పంపిణీకి సిద్ధంగా ఉన్న 40 లక్షల క్యాప్సూల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మాదకద్రవ్యాల తయారీకి పూర్తిస్థాయిలో సిద్ధం చేసిన ఫ్యాక్టరీని కూడా గుర్తించి సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలు, ఫ్యాక్టరీ తదితరాల మార్కెట్ విలువ సుమారు 150 మిలియన్ కువైట్ దినార్లు (KD) ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కువైట్ చరిత్రలో 'లారికా' తయారీ, విక్రయాలకు సంబంధించి ఇదే అతిపెద్ద ఆపరేషన్ అని అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది.

కొత్తగా అమల్లోకి వచ్చిన నార్కోటిక్స్ కంట్రోల్ చట్టం కువైట్‌లో డ్రగ్స్‌ అక్రమ రవాణాపై నిరోధక వ్యవస్థను మరింత బలోపేతం చేసిందని షేక్ ఫహద్ తెలిపారు. ఈ చట్టం డ్రగ్స్‌ అక్రమ రవాణాదారుల్లో భయాన్ని పెంచిందని పేర్కొన్నారు. సమాజాన్ని మాదకద్రవ్యాల ముప్పు నుంచి రక్షించేందుకు భద్రతా చర్యలను మరింత ముమ్మరం చేసి, చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని కువైట్ అధికారులు స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu