Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!

లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!

maa gulf 2 weeks ago

రియాద్: సౌదీ అరేబియాలోని కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్ లో అనుమతి లేకుండా వన్యప్రాణులను వేటాడిన నలుగురు పౌరులను పర్యావరణ భద్రత ప్రత్యేక దళాలు అరెస్ట్ చేశాయి.

రిజర్వ్‌లో గస్తీ నిర్వహిస్తున్న ప్రత్యేక దళాల సిబ్బంది తనిఖీలు చేపట్టగా.. నిందితుల వద్ద రెండు ఎయిర్ రైఫిళ్లు, వేటాడిన 15 వన్యప్రాణులు గుర్తించారు. దీంతో నలుగురినీ అదుపులోకి తీసుకుని, అవసరమైన చట్టపరమైన ప్రక్రియ అనంతరం సంబంధిత అధికారులకు అప్పగించారు.

వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన నిబంధనలు, వాటి అమలు మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని పర్యావరణ భద్రత ప్రత్యేక దళాలు సూచించాయి. లైసెన్స్ లేకుండా వేటాడితే 10,000 సౌదీ రియాల్స్ జరిమానా విధిస్తారు. నిషేధిత ప్రాంతాల్లో వేటకు 5,000 రియాల్స్ జరిమానా ఉంటుంది. అలాగే లైసెన్స్ లేకుండా కామన్ వార్బ్లర్ పక్షిని వేటాడినా 5,000 రియాల్స్ జరిమానా విధిస్తారు.

వన్యప్రాణులు, పర్యావరణానికి సంబంధించిన ఉల్లంఘనలు కనిపిస్తే ప్రజలు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. మక్కా, మదీనా, రియాద్, తూర్పు ప్రావిన్స్‌లలో 911కు, మిగిలిన ప్రాంతాల్లో 999 లేదా 996కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, ఫిర్యాదు చేసిన వ్యక్తిపై ఎలాంటి బాధ్యత ఉండదని స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu