Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లేబర్ మార్కెట్ అభివృద్ధికి కొత్త విధానాలను ప్రకటించనున్న సౌదీ ప్రభుత్వం

లేబర్ మార్కెట్ అభివృద్ధికి కొత్త విధానాలను ప్రకటించనున్న సౌదీ ప్రభుత్వం

maa gulf 5 years ago

రియాద్:లేబర్ మార్కెట్ అభివృద్ధి కోసం త్వరలోనే కొత్త విధానాలను ప్రకటిస్తామని మానవ వనరులు, సాంఘిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు. అయితే..ఆ కొత్త విధానాలు ఎలా ఉండబోతున్నాయి...ఎలాంటి సంస్కరణలకు ఊతం ఇవ్వబోతున్నాయనే విషయాన్ని కూడా వీలైనంత త్వరగా ప్రకటిస్తామని, తమ అధికారిక మాధ్యమాల ద్వారా వెలువడే ప్రకటనను మాత్రమే ప్రజలు పరిగణలోని తీసుకోవాలని సూచించారు. సౌదీ ప్రభుత్వం కార్మిక శాఖ కొత్త విధానాలు ప్రకటించటం అంటే ..దశాబ్దాల నుంచి వస్తున్న కఫాలా వ్యవస్థను రద్దు చేయటమేనంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఉద్యోగులు, కంపెనీ మధ్య కాంట్రాక్ట్ స్థానంలో కొత్త కాంట్రాక్ట్ విధానం అమల్లోకి వస్తుందని ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ప్రచారం నేపథ్యంలోనే మానవ వనరులు, సాంఘిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. తమ శాఖ నుంచి ఖచ్చితమైన విధానాలు ప్రకటించే వరకు ఎలాంటి ఊహాజనిత ప్రచారాన్ని మానుకోవాలని కోరింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu