Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'LIK' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

'LIK' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

maa gulf 1 month ago

'లవ్ టుడే', 'డ్యూడ్', 'డ్రాగన్' వంటి వరుస హిట్లతో బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టిన కోలీవుడ్ క్రేజీ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా చిత్రం 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (LIK).

విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యూచరిస్టిక్ రోమాంటిక్ డ్రామా ఇప్పుడు డిజిటల్ సందడికి సిద్ధమైంది.

ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ, వసూళ్ల పరంగా పరవాలేదనిపించింది. తాజాగా ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) దక్కించుకుంది. మే 06వ తేదీ నుండి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది.

యోగి బాబు, సీమాన్, గౌరీ కిషన్, షా రా, మాళవిక తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. 2040 కాలంలో ఒక యాప్ ఆధారంగా ప్రేమ, బ్రేకప్స్ ఎలా ఉంటాయనేది ఇందులో వినోదాత్మకగా చూపించారు దర్శకుడు విఘ్నేష్ శివన్. అయితే సినిమా కాన్సెప్ట్ బాగున్నా, దాన్ని ఎంగేజింగ్‌గా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడన్న విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే పెద్దగా ఆకట్టుకోలేదని రివ్యూలు వచ్చాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu