రియాద్ః సౌదీ అరేబియాలో వినియోగదారుల(కన్జుమర్) వ్యయం పెరిగింది.2025 మార్చి నెలలో SR148 బిలియన్లుగా ఉన్న ఈ వ్యయం, 2026 మార్చి నాటికి SR150.1 బిలియన్లకు చేరుకుంది.
ఈ మేరకు సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) గణాంకాలను విడుదల చేసింది. గతేడితో పోలిస్తే, 2026 మార్చిలో సౌదీ అరేబియాలోని 'పాయింట్స్ ఆఫ్ సేల్' (POS) ద్వారా జరిగిన విక్రయాలు ఒక శాతం పెరిగి, సుమారు SR66.1 బిలియన్లకు చేరుకున్నాయి.
ATMల నుండి నగదు ఉపసంహరణలు 11 శాతం తగ్గి, SR48.6 బిలియన్లకు చేరుకున్నాయి.మడా (Mada) కార్డుల ద్వారా జరిగిన ఈ-కామర్స్ విక్రయాలు 28 శాతం పెరిగి, SR35.4 బిలియన్లకు చేరుకున్నాయి. ఈ విక్రయాలు 200.3 మిలియన్ల లావాదేవీల ద్వారా జరిగాయి. ఇ-కామర్స్ అమ్మకాలలో షాపింగ్ వెబ్‌సైట్‌లు మరియు మొబైల్ అప్లికేషన్‌ల ద్వారా చెల్లింపులు మరియు కొనుగోళ్ల కోసం మాడా కార్డులను ఉపయోగిస్తారు. సౌదీ అరేబియాలో కన్జుమర్ల ఖర్చులో నగదు ఉపసంహరణలు, పాయింట్-ఆఫ్-సేల్ (POS) అమ్మకాలు మరియు మాడా ద్వారా జరిగే ఇ-కామర్స్ అమ్మకాలు ఉంటాయి.

