న్యూ ఢిల్లీ: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు మే మూడవ వారంలో విడుదల కానున్నాయి. ఇప్పటికే 10వ తరగతి ఫలితాలు ప్రకటించిన బోర్డు, 12వ తరగతి ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది.
విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్, ఉమాంగ్ యాప్, డిజిలాకర్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత లభిస్తుంది. ఒకటి లేదా రెండు సబ్జెక్టులలో ఫెయిల్ అయినవారు కంపార్ట్‌మెంట్ కేటగిరీ కిందకు వస్తారు. ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10 వరకు జరిగిన పరీక్షలకు దేశవ్యాప్తంగా 18 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు.

