Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి వారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు దంపతులు

నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి వారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు దంపతులు

maa gulf 1 week ago

తిరుపతి: తిరుపతి జిల్లా నాగలాపురంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు దంపతులు సోమవారం స్వామి వారిని దర్శించుకున్నారు.

దశావతారాల్లో తొలి అవతారమైన మత్స్యావతార స్వరూపుడు శ్రీ వేదనారాయణస్వామి వారికి ప్రత్యేక పూజల్లో పాల్గొని దేశ ప్రజల సుఖశాంతులు, సనాతన ధర్మాభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.

టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం,నరేష్ కూడా చైర్మన్‌తో కలిసి స్వామివారి సేవలో పాల్గొని దర్శనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ వేదనారాయణస్వామివారి క్షేత్ర మహిమ, ఆధ్యాత్మిక విశిష్టతను చైర్మన్‌కు వివరించారు. అనంతరం ఆలయ అధికారులు వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను సమర్పించి సత్కరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu