మస్కట్: అల్-మస్నా ప్రాంతంలో ఒక వాహనం లోపల నలుగురు బంగ్లాదేశ్ వాసులు మరణించారు. కేసు నమోదు చేసుకున్న దక్షిణ అల్ బతినా గవర్నరేట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వాహనం నడుస్తున్న రన్నింగ్ సమయంలో దాని ఎగ్జాస్ట్ పైపు నుండి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వాయువును పీల్చడం వల్లే ఈ నలుగురూ మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఈ సందర్భంగా పోలీసులు పలు సూచనలు చేశారు. వాహనాన్ని నడుపుతూ నిద్రించవద్దని, మూసి ఉన్న ప్రదేశాలలో వాహనాన్ని ఆన్ చేసి పెట్టవద్దని రాయల్ ఒమన్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం వల్ల వాహనం నుంచి వెలువడే విష వాయువుల కారణంగా ఊపిరాడక మరణించే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.

