Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
NEET రీ-ఎగ్జామ్ తేదీ వచ్చేసింది

NEET రీ-ఎగ్జామ్ తేదీ వచ్చేసింది

maa gulf 1 week ago

న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో, ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకోసం మే3 వ తేదీన నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష-యూజీ (NEET UG) రద్దయిన విషయం తెలిసిందే.

పేపర్ లీక్ ఆరోపణలతో రద్దయిన నీట్ యూజీ 2026 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. జూన్ 21వ తేదీన (ఆదివారం) ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం ఎక్స్ వేదికగా వెల్లడించింది. అధికారిక మార్గాల్లో వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఎన్టీఏ కోరింది. హాల్ టికెట్, ఇతరత్రా వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.

దేశవ్యాప్తంగా మే3వ తేదీన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష -యూజీని (నీట్-యూజీ) నిర్వహించిన విషయం తెలిసిందే. 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. అయితే, ఈ పరీక్ష ప్రశ్నాపత్రాలు కొన్నిచోట్ల లీకయ్యాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మే3వ తేదీన నిర్వహించిన పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. మళ్లీ రీ-ఎగ్జామ్ నిర్వహిస్తామని తెలిపింది. అయితే, రీ ఎగ్జామ్ కు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన పనిలేదని, ఫీజు కూడా చెల్లించే అవసరం లేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. దీంతో తాజాగా.. జూన్ 21వ తేదీన రీ-ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుందని ఎన్టీఏ అధికారికంగా ప్రకటించింది.

మరోవైపు.. నీట్ పేపర్ లీక్ పై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే కీలక నిందితులను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు వారిని విచారిస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని సికార్‌లో ఈ లీకేజీ వ్యవహారం బయటపడింది. అయితే, మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ప్రశ్నపత్రం లీక్ అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి రాజస్థాన్, హరియాణా, జమ్మూకశ్మీర్, కేరళ సహా పలు రాష్ట్రాలకు లీక్ అయిన పేపర్ చేరినట్లు దర్యాప్తులో తేలింది. అయితే, ఈ పేపర్ కోసం విద్యార్థుల నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, సీబీఐ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu