మక్కా: వాణిజ్య మంత్రిత్వ శాఖ నెలరోజుల్లో మక్కా మరియు మదీనా ప్రాంతాలలోని వాణిజ్య సంస్థలు మరియు రిటైల్ అవుట్‌లెట్‌లలో 42,791 తనిఖీలు నిర్వహించింది.
ప్రస్తుత హజ్ సీజన్ కోసం రూపొందించిన పర్యవేక్షణ ప్రణాళికలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిత్యావసర వస్తువుల స్టాక్ తోపాటు వినియోగదారులకు ప్రత్యామ్నాయాలు, యాత్రికుల విభిన్న అవసరాలను తీర్చడానికి స్థానిక మార్కెట్ల సంసిద్ధతను బలోపేతం చేయడం తనిఖీల లక్ష్యమని తెలిపింది.
తనిఖీల్లో భాగంగా రిటైల్ కేంద్రాలు, పబ్లిక్ మార్కెట్లు, ఆభరణాల దుకాణాలలో కూడా ఇన్‌స్పెక్టర్లు పరిశీలించినట్లు పేర్కొన్నది. వాణిజ్య నిబంధనల అమలు, యాత్రికులకు నాణ్యమైన సేవలు అందేలా చర్యలు చేపట్టినట్లు తెలిపింది. హజ్ సీజన్ మొత్తం తనిఖీలను ముమ్మరం చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

