తాజా వార్తలు
నేతాజీ జయంతి సందర్భంగా నివాళి అర్పించిన ప్రధాని మోదీ

న్యూ ఢిల్లీ: భారత స్వతంత్ర సమర యోధుల్లో నెతాజి సుభాష్ చంద్రబోస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. తెల్ల దొరలను సైతం భయబ్రాంతులకు గురిచేసిన వారిలో నేతాజి ఒకడు. తన తెగింపు, సమయస్ఫూర్తితో అనేక దేశాల దళాలను ఏకం చేశాడు. అఖండ భారతాన్ని ఏర్పరచడంలో అతడిది ప్రత్యేక స్థానం. అతడి గురించి మాట్లాడాలన్నా రాయాలనన్నా పదాలు చాలవు అనేంతగా దేశ చేసిన అమర వీరుడు నేతాజి సుభాష్ చంద్రబోస్. నేడు నేతాజి 125వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేడు నేతాజీకి నివాళి అర్పించారు. నేడు నేతాజి 125వ జన్మదినోత్సవం సందర్భంగా అతడి వీర్య కలపాలను గుర్తు చేసుకున్నారు. దేశంలో అందరూ గౌరవించే స్వతంత్ర యోధుల్లో నేతాజి ఒకడని, అతడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువగానే ఉంటుందని, అతడు చేసిన దేశ సేవ లెక్క కట్టలేనిదని రాష్ట్రపతి అన్నారు.
'నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు జన్మనదిన సందర్భంగా అతడికి నా నివాళి అర్పిస్తున్నాను. నేటి నుంచి ప్రతి ఏడాది నేతాజి పుట్టినరోజును పరాక్రమ దినోత్సవంగా జరుపుకోనున్నాం. అతడి హద్దులు లేని ధైర్యానికి, మానసిక స్థైర్యానికి చిహ్నంగా పరాక్రమ దినోత్సవం జరుపుకోనున్నాం. దేశ సేవను అతడి అనుచరులు ఎంతగానో ప్రోత్సహించార'ని రామ్ నాథ్ ట్వీట్ చేశారు.
'నేతాజీ భారత పౌరుల గుండెల్లో ఎల్లప్పుడు ఒక గొప్ప హీరోగా నిలిచిపోయి ఉంటారు. అతడు జాతికి చేసిన మేలు, సేవా మరువలేనిది, దేశ స్వతంత్ర్యం కోసం అతడు పడిన పాట్లు చెప్పలేనివి ఏది ఏమైనా దేశాన్ని తెల్ల దొరల కబంధ హస్తాల నుంచి విడిపించాలని అతడు చేసిన సాహస కృత్యాలు ఎన్నో ఉన్నాయ' మరోక ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రధాని మోదీ కూడా నేడు నేతాజీకి నివాళి అర్పించారు. 'నేతాజీ అతి గొప్ప దేశ సేవకుడు అంతకుమించిన స్వతంత్ర సమర యోధుడు.
వీటన్నింటికి మించి అసలు సిసలైన భారత మాత ముద్దు బిడ్డ. అతడు చేసిన త్యాగాలను భారత దేశం ఎన్నటికీ మరువలేద'ని మోదీ అన్నారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ దేశానికి చేసిన సేవ, దేశం కోసం చేసిన త్యాగాలకు చిహ్నంగా అతడి పుట్టిన రోజును పరాక్రమ దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన్నట్లు తెలిపారు.. ఇందులో భాగంగా నేడు ప్రధాని మోదీ కోల్‌కతాలోని ఎల్జిన్ రోడ్‌లో ఉన్న నేతాజీ భవన్‌ను సందర్శించనున్నారు.
ఇదిలా ఉంటే బ్రిటీష్ వారిని గడగడలాడించిన పరాక్రమ వీరుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ 1897 జనవరి 23న ఒడిసాలో జానకీనాథ్ బోస్‌కు జన్మించారు. అతని తండ్రి ఒక అడ్వకేట్. అయితే భారత స్వాతంత్ర్య సమరంలో నేతాజీ ఎంతో కీలక పాత్ర పోషించారు. 'అజాద్ హిందు ఫౌజ్'ను ఏర్పరిచారు. అయితే 1945 ఆగస్టు 18న విమాన ప్రమాదంలో నేతాజి మరణించినట్లు పుకార్లు ఉన్నాయి. కానీ అతడికి ఏమైందన్నది ఎవరికీ తెలియదు. అయితే ఈ సంఘటనలోనే నేతాజి మరణించారని 2017లో కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్‌టీఐలో పేర్కొంది.
related stories
-
హెరాల్డ్ కార్డ్స్ తెలంగాణ భాష, యాసపై షర్మిల శిక్షణ పొందుతోందట. తెలంగాణ రాజకీయాల్లో రాణించాలంటే.....
-
తెలంగాణ తాజావార్తలు తెలంగాణవాసికి 'శరత్చంద్ర ఛటోపాధ్యాయ్' పురస్కారం
-
ప్రధాన వార్తలు ప్రధాని మోదీకి వృద్ధురాలి ఆశీస్సులు