న్యూఢిల్లీ: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ వేడుకలను న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకల్లో తెలుగు సమాజానికి చెందిన పలువురు పాల్గొని సందడి చేశారు.
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. తెలుగు ప్రజలకు ఎక్కడ, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఆదిలీల ఆర్గనైజేషన్ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని నిర్వాహకులు ఆదినారాయణ ఫౌండేషన్ ఫౌండర్ డా.ఆదినారాయణ ఫౌండేషన్ ఫౌండర్ డా.ఆదినారాయణ తెలిపారు.
బోనాల పండుగ వేడుకలు విజయవంతం కావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ, అలాగే కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. "తెలుగు సంస్కృతి మన గర్వం.. తెలుగు వారి ఐక్యత మన బలం" అనే సందేశంతో కార్యక్రమాన్ని ముగించారు.


