Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒమాన్‌లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!

ఒమాన్‌లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!

maa gulf 1 week ago

స్కట్: ఒమాన్‌లో ఆగస్టు నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వర్షపాతం సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉండే అవకాశముందని ఆ దేశ సివిల్ ఏవియేషన్ అథారిటీ (సీఏఏ)కు చెందిన నేషనల్ మల్టీ-హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సెంటర్ వెల్లడించింది.

ఆగస్టు-సెప్టెంబర్-అక్టోబర్ 2026 కాలానికి సంబంధించిన సీజనల్ వాతావరణ అంచనాలను విడుదల చేసింది.ప్రతి నెల విడుదల చేసే ఈ సీజనల్ బులెటిన్ రానున్న నెలల్లో నెలకొనే వాతావరణ పరిస్థితులపై ముందస్తు అవగాహన కల్పించేందుకు ఉపయోగపడుతుందని సీఏఏ తెలిపింది.

అయితే, ఈ అంచనాలు కేవలం దీర్ఘకాలిక సూచనలు మాత్రమేనని, రోజువారీ ప్రణాళికల కోసం స్వల్ప, మధ్యకాల వాతావరణ బులెటిన్లను తప్పనిసరిగా అనుసరించాలని అధికారులు సూచించారు.ప్రభుత్వ శాఖలు, వ్యాపార సంస్థలు, ప్రజలు ముందస్తుగా అవసరమైన ఏర్పాట్లు చేసుకునేందుకు ఈ సీజనల్ అంచనాలు ఉపయోగపడతాయని, ఇవి సాధారణ వాతావరణ హెచ్చరికలకు ప్రత్యామ్నాయం కాదని సీఏఏ స్పష్టం చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu