Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!

ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!

maa gulf 3 weeks ago

స్కట్: ఒమన్ లో మత్స్య రంగాన్ని బలోపేతం చేయడంతోపాటు పటిష్టమైన పర్యవేక్షణకు చర్యలు వేగవంతం చేశారు. ఈ మేరకు రిటైల్ చేపల ధరలను పర్యవేక్షించడానికి ప్రత్యేకమైన కాంపిటేటివ్ అథారిటీని ఏర్పాటు చేశారు.

మార్కెట్లలో చేపల ఉత్పత్తుల రిటైల్ ధరలను నిర్ణయించడంతోపాటు సెంట్రల్ రిటైల్ మార్కెట్, ఫిషింగ్ పోర్టులలోని చేపల మార్కెట్లు, ల్యాండింగ్ కేంద్రాలు లేదా సేకరణ కేంద్రాల నుండి వచ్చిన కొనుగోలు ఇన్‌వాయిస్‌ల ఆధారంగా నిర్ణయించిన ధరలపై, వినియోగదారుల వద్ద వసూలు చేసే రిటైల్ ధర రిటైల్ ధర కంటే 30 శాతం మించకూడదని వ్యవసాయ, మత్స్య మరియు జలవనరుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

అయితే, ఈ నిబంధన అన్ని చేపల మార్కెట్లలో ఒకే రకమైన ధరలను నిర్ణయించదని, హోల్‌సేల్ ఇన్‌వాయిస్‌లను ప్రామాణికంగా ఉపయోగించి, అవసరమైనప్పుడు రిటైల్ ధరలను నియంత్రించడానికి అథారిటీకి చట్టపరమైన అధికారాలను కల్పిస్తుంది.

ఇది మార్కెట్ పారదర్శకతను బలోపేతం చేయడంతోపాటు చేపల మార్కెట్లలో లైసెన్స్ పొందిన చిల్లర వ్యాపారులపై స్పష్టమైన నియంత్రణను నిర్దేశిస్తుందని భావిస్తున్నారు. అదే సమయంలో వాణిజ్య చేపల వేట నౌకలు, చేపల నాణ్యత నియంత్రణ, ఆక్వాకల్చర్, చేపల మార్కెట్లు, చేపల వేట పరికరాలు మరియు వినోదపరమైన చేపల వేట వంటి అంశాలను కవర్ చేసే మునుపటి నిబంధనలను ఇప్పుడు ఈ అథారిటీ పరిధిలోకి తీసుకొచ్చినట్లు జలవనరుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu