Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పంజాబ్స్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం..

పంజాబ్స్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం..

maa gulf 1 week ago

పంజాబ్స్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ దుమ్మురేపింది. పంజాబ్ పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.

201 రన్స్ టార్గెట్ ను ముంబై మరో బంతి మిగిలి ఉండగానే చేజ్ చేసింది. 6 వికెట్ల తేడాతో పంజాబ్ ను చిత్తు చేసింది. ముంబై బ్యాటర్లలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు.

33 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు. 6 సిక్సర్లు, 6 ఫోర్లు బాదాడు. చివరి వరకు క్రీజులో నిలబడి ముంబై విజయంలో కీ రోల్ ప్లే చేశాడు తిలక్ వర్మ. ఈ టోర్నీ నుంచి ఇప్పటికే ముంబై నిష్క్రమించిన సంగతి తెలిసిందే. మరోవైపు పంజాబ్ పరాజయాల పరంపర కంటిన్యూ అవుతోంది. పంజాబ్ కు ఇది వరుసగా 5వ పరాజయం. తొలుత ఓటమి అన్నది లేకుండా రాణించిన పంజాబ్.. ఇప్పుడు వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu