Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్

పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్

maa gulf 3 weeks ago

మరావతి: జర్నలిస్ట్ ఒక సామాజిక యోధుడని, పత్రికా స్వేచ్ఛ అనేది కేవలం జర్నలిస్టుల హక్కు మాత్రమే కాదు, అది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు వంటిది అని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.మే 3వ తేదీ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులందరికీ, పత్రికా రంగానికి మంత్రి కందుల దుర్గేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా రంగం నాలుగో స్తంభం వంటిదని, సమాజంలోని వాస్తవాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర వెలకట్టలేనిదని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పౌరుల హక్కులను కాపాడటంలో, ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ జర్నలిజం సమాజ హితం కోసం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి వృత్తిపరమైన స్వేచ్ఛను గౌరవిస్తూనే, ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో 'వేగం' కంటే 'విశ్వసనీయత' ముఖ్యమని, తప్పుడు వార్తలను నిరోధిస్తూ, విలువలతో కూడిన జర్నలిజాన్ని కాపాడటంలో ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా, సోషల్ మీడియా జర్నలిస్టులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని నింపాలని సూచించారు.వృత్తిపరమైన సవాళ్లను అధిగమిస్తూ, నిజాన్ని నిర్భయంగా చాటిచెప్పే జర్నలిస్టులందరికీ ఈ దినోత్సవం ఒక స్ఫూర్తిదాయకమైన రోజని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.సత్యమే ఆయుధంగా, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న పత్రికా మిత్రులందరికీ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో జర్నలిస్టు పాత్ర అమోఘం అన్నారు..సమాజ హితం కోసం పని చేస్తున్న మీడియా సంస్థలు కూటమి సర్కార్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో చేస్తున్న సమగ్ర అభివృద్ధిని, ప్రజా రాజధాని అమరావతి, పోలవరం తదితర అన్ని అంశాలపై, ప్రజలకు అందిస్తున్న సంక్షేమాన్ని విరివిగా ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ప్రత్యేకించి పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలకు విశేష ప్రాచుర్యం కల్పించి రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి దోహదం చేయాలని కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu