Dailyhunt
ప్రభాస్ ఫౌజీ షూటింగ్ కి వెళ్తుండగా యాక్సిడెంట్..ఒకరు మృతి..

ప్రభాస్ ఫౌజీ షూటింగ్ కి వెళ్తుండగా యాక్సిడెంట్..ఒకరు మృతి..

maa gulf 4 days ago

ప్రభాస్ ఫౌజీ షూటింగ్ కి వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగి ఒకరు మృతి చెందారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతునన్ సినిమా ఫౌజీ.ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలో వేసిన సెట్స్ లో జరుగుతుంది.

ఈ సినిమా షూటింగ్ కి ప్రొడక్షన్ సభ్యులు ప్రయాణిస్తున్న కార్ అబ్దుల్లాపూర్ మెట్ వద్ద యాక్సిడెంట్ కు గురైంది. కార్ ఎదురుగా ఉన్న డివైడర్ కి గుద్దుకోవడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ కార్ లో ఆరుగురు ప్రయాణిస్తుండగా ప్రమాదంలో ఓ ప్రొడక్షన్ వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు సభ్యులను వెంటనే దగ్గర్లోని హాస్పిటల్ కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu