Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎం విజయ్ మరో బిగ్ డెసిషన్..

సీఎం విజయ్ మరో బిగ్ డెసిషన్..

maa gulf 1 week ago

18 కాదు ఇక 21 ఏళ్లు.. ఐడీ కార్డ్ చూపిస్తేనే మద్యం !

చెన్నై: తమిళనాడు సర్కార్ మద్యం అమ్మకాల పై చకచకా నిర్ణయాలు తీసుకుంటుంది. నిన్నటికి నిన్న గుళ్లు, గోపురాలు, స్కూల్స్, బస్టాండ్ల దగ్గరలో ఉన్న 717 లిక్కర్ షాపులను మూసివేస్తూ సీఎం విజయ్ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పుడు లిక్కర్ పాలసీకి సంబంధించి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారాయన. మద్యం అమ్మకాలకు సంబంధించి ఇప్పటి వరకు 18 ఏళ్ల వయస్సు ఏజ్ లిమిట్గా ఉంది. ఇక నుంచి ఆ వయస్సును 21 ఏళ్లకు పెంచుతూ సీఎం విజయ్ ఆదేశాలు జారీ చేశారు.

18 ఏళ్లలోపు వాళ్లకు వైన్ షాపుల్లో లిక్కర్ అమ్మబడదు.. 18 ఏళ్లలోపు వాళ్లకు బార్లు, పబ్స్ లో ఎంట్రీ లేదు అనే బోర్డులు ఉండేవి. ఇక నుంచి 21 ఏళ్ల వయస్సులోపు వాళ్లకు వైన్ షాపుల్లో మద్యం అమ్మరు.. బార్లు, పబ్స్ లో నో ఎంట్రీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం విజయ్. వయస్సు ధృవీకరణ కోసం కొత్త రూల్స్ తీసుకొచ్చింది తమిళనాడు సర్కార్. ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడీ కార్డు చూపించాల్సి ఉంటుంది. 21 ఏళ్ల వయస్సు నిండిన వాళ్లకే మద్యం అమ్ముతారు. వైన్ షాపుల దగ్గర వయస్సుకు సంబంధించి అమ్మకం దారులకు అనుమానం వస్తే.. మద్యం కొనుగోలుదారులు తమ వయస్సు ధృవీకరణ పత్రాలు చూపించాల్సి ఉంటుంది.

వైన్ షాపులు, బార్లు, పబ్స్ దగ్గర కొత్తగా 21 ఏళ్ల వయస్సులోపు వాళ్లకు మద్యం అమ్మకాలు ఉండవు అనే బోర్డులు కచ్చితంగా ప్రదర్శించాలని వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సాగుతాయి. బార్లు, పబ్స్ ప్రైవేట్ వ్యాపారులు నిర్వహిస్తుంటారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu