Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!

సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!

maa gulf 1 week ago

రియాద్: సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి, క్యాబినెట్ సభ్యుడు, వాతావరణ దూత అదెల్ అల్-జుబైర్ బుధవారం భారత, బ్రెజిల్ దేశాల రాయబారులతో సమావేశమయ్యారు.

రియాద్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో సౌదీ అరేబియాలో నూతనంగా నియమితులైన భారత రాయబారి విపుల్‌తో అల్-జుబైర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన భారత రాయబారికి స్వాగతం పలికి, కొత్త బాధ్యతల్లో విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

అలాగే, సౌదీ అరేబియాలో బ్రెజిల్ రాయబారి పాలో ఉచోవా రిబెయిరో ఫిల్హోతో కూడా అల్-జుబైర్ సమావేశమయ్యారు. ఇరువురు పరస్పర ఆసక్తికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. భారత్, బ్రెజిల్‌తో సౌదీ అరేబియా ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారానికి సంబంధించిన అంశాలపై ఈ భేటీలు జరిగాయని అధికార వర్గాలు తెలిపాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu