Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సౌదీ అరేబియాకు కృతజ్ఞతలు తెలిపిన యెమెన్..!!

సౌదీ అరేబియాకు కృతజ్ఞతలు తెలిపిన యెమెన్..!!

maa gulf 2 weeks ago

డెన్-యెమెన్ అభివృద్ధి మరియు పునర్నిర్మాణ కార్యక్రమానికి సౌదీ అరేబియా శ్రీకారం చుట్టింది. యెమెన్‌లోని విద్యుత్ ప్లాంట్ల నిర్వహణ అవసరాలను తీర్చడానికి 150 మిలియన్ డాలర్ల విలువైన తక్షణ మద్దతు అందించాలన్న సౌదీ అరేబియా నిర్ణయాన్ని యెమెన్ ప్రభుత్వం ప్రశంసించింది.

తమ దేశానికి సౌదీ అందించిన ఈ మద్దతుకు యెమెన్ అధ్యక్ష నాయకత్వ మండలి ఛైర్మన్ డాక్టర్ రషద్ అల్-అలీమీ కృతజ్ఞతలు తెలిపారు.

విద్యుత్ ప్లాంట్లను నడపడానికి మరియు యెమెన్ ప్రజల కష్టాలను తగ్గించడానికి కేటాయించిన పెట్రోలియం ఉత్పన్నాల కొత్త గ్రాంటుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మద్దతు ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను బలోపేతం చేస్తుందన్నారు. యెమెన్ ప్రజలకు అండగా నిలిచారని, ఇది వారి మానవతా ధృక్పతాన్ని తెలియజేస్తుందని యెమెన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu