Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!

సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!

maa gulf 5 days ago

రియాద్: సౌదీ అరేబియాలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, సేవలందించే సంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రియల్ ఎస్టేట్ జనరల్ అథారిటీ (REGA) హెచ్చరించింది.

నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే లైసెన్స్‌ను సస్పెండ్ చేయడం లేదా పూర్తిగా రద్దు చేయడంతో పాటు గరిష్ఠంగా 2 లక్షల సౌదీ రియాల్స్ (SR200,000) వరకు జరిమానా విధించవచ్చని స్పష్టం చేసింది. చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండానే రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించడం, ఆస్తి యజమానులు లేదా లబ్ధిదారుల నుంచి పొందిన సమాచారాన్ని సరైన రీతిలో ధృవీకరించడంలో నిర్లక్ష్యం వహించడం, అలాగే రియల్ ఎస్టేట్ ప్రకటనల్లో లైసెన్స్‌దారుడి పేరు లేదా లైసెన్స్ నంబర్‌ను ప్రదర్శించకపోవడం వంటి ఉల్లంఘనలను తనిఖీల సందర్భంగా గుర్తించడం జరిగిందని అధికారులు తెలిపారు.

369 రియల్ ఎస్టేట్ సంస్థల్లో తనిఖీలు

సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో 39 ఉమ్మడిగా పర్యటనలు నిర్వహించిన అధికారులు మొత్తం 369 రియల్ ఎస్టేట్ సంస్థలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పలు నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చినట్లు REGA తెలిపింది. రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను క్రమబద్ధీకించేందుకు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టడం తమ ముఖ్యమైన పద్ధతుల్లో ఒకటని అథారిటీ పేర్కొంది.

గత ఆగస్టులో REGA తనిఖీ బృందాలు ప్రకటనల బోర్డులు, రియల్ ఎస్టేట్ కార్యాలయాలపై మొత్తం 17,182 క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా అనేక ఉల్లంఘనలను గుర్తించినట్లు వెల్లడించింది. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, సేవలందించే సంస్థలు అందరూ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్టం మరియు దాని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని REGA సూచించింది. అదేవిధంగా, అనుమానాస్పద నిబంధనల ఉల్లంఘనలు లేదా రియల్ ఎస్టేట్ మోసాలకు సంబంధించిన సమాచారం ఉంటే, పౌరులు మరియు నివాసితులు REGA అధికారిక ప్లాట్‌ఫామ్‌లోని ఫిర్యాదు విభాగం ద్వారా అధికారులకు సమాచారం ఇవ్వాలని అథారిటీ విజ్ఞప్తి చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu