Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!

సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!

maa gulf 2 weeks ago

షార్జా: షార్జాలోని సూడాన్ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న సూడానీ విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయవద్దని షార్జా పాలకుడు, సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమీ ఆదేశించారు.

ఇప్పటికే తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన నామమాత్రపు ఫీజులను కూడా తిరిగి చెల్లించాలని షార్జా ప్రైవేట్ ఎడ్యుకేషన్ అథారిటీ (SPEA)కి సూచించారు. 'డైరెక్ట్ లైన్' కార్యక్రమంలో ఫోన్ ద్వారా మాట్లాడిన షేక్ డాక్టర్ సుల్తాన్, షార్జాలోని ఆర్థికంగా వెనుకబడిన సూడానీ కుటుంబాల పిల్లల కోసం ఈ పాఠశాలను పూర్తిగా ఉచితంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సూడానీ తల్లిదండ్రుల్లో కొందరు తమ పిల్లలను ఇతర పాఠశాలల్లో చేర్పించే ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించిన తర్వాత ఈ పాఠశాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఉపాధ్యాయుల నిర్వహణతో పాటు పాఠశాల నిర్వహణకు సంబంధించిన అన్ని ఖర్చులను తాము భరిస్తున్నామని, తల్లిదండ్రుల నుంచి ఎలాంటి రుసుములు వసూలు చేయాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

అయితే షార్జా ప్రైవేట్ ఎడ్యుకేషన్ అథారిటీ కొన్ని ఫీజులను 'నామమాత్రపు రుసుములు'గా నిర్ణయించినట్లు తమ దృష్టికి వచ్చిందని షేక్ సుల్తాన్ తెలిపారు. అవసరంలో ఉన్న కుటుంబాలకు చిన్న మొత్తంలో ఫీజు కూడా భారమేనని పేర్కొంటూ, పెద్ద మొత్తమైనా, చిన్న మొత్తమైనా విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజు తీసుకోవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల నిర్వహణను తాము నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. బోధనలో లోపాలు ఉన్న ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి మెరుగుపర్చేందుకు అవకాశం కల్పిస్తామని, అయినప్పటికీ పనితీరు మెరుగుపడకపోతే పాఠశాల నుంచి తొలగిస్తామని వివరించారు.

నిర్ణయం సూడానీ విద్యార్థుల తల్లిదండ్రి 'డైరెక్ట్ లైన్' కార్యక్రమానికి పంపిన ఫిర్యాదుకు స్పందనగా వెలువడింది. షార్జా పాలకుడు తమ కమ్యూనిటీ పిల్లలకు గౌరవ సూచకంగా పూర్తిగా ఉచిత పాఠశాలను అందించారని, అయితే ఏడాది చదువు పూర్తైన తర్వాత అధిక ఫీజులు చెల్లించాలని కోరారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

బకాయి ఫీజులతో పాటు ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులు చెల్లించకపోతే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని కూడా తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన షార్జా రూలర్.. పాఠశాల పూర్తిగా ఉచితంగా ఉండాలనే తన ఉద్దేశాన్ని పునరుద్ఘాటిస్తూ, ఇప్పటికే అవసరంలో ఉన్న కుటుంబాల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని వెంటనే తిరిగి చెల్లించాలని ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu