Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'టాక్సిక్' ట్రైలర్ ఆగస్టు 8న రిలీజ్- ఆకట్టుకునే బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్

'టాక్సిక్' ట్రైలర్ ఆగస్టు 8న రిలీజ్- ఆకట్టుకునే బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్

maa gulf 2 weeks ago

రాకింగ్ స్టార్ యష్ 'టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్' ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు తెరదించుతూ మేకర్స్ తాజాగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసి, సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 8, 2026న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

కొత్త పోస్టర్‌లో యష్ పోషిస్తున్న 'రాయా' పాత్రను సిల్హౌట్ రూపంలో చూపించారు. చేతిలో టామీ గన్ పట్టుకుని కనిపించే ఈ పోస్టర్, సినిమా ప్రపంచం ఎంత రా, ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతుందో సూచిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌లాగే ఈ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేస్తూ, సినిమా కథపై అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.

ట్రైలర్‌ను బెంగళూరులో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. యష్, కేవీఎన్ ప్రొడక్షన్స్ హోమ్ స్టేట్ అయిన కర్ణాటక నుంచే సినిమా ప్రమోషన్స్‌కు శ్రీకారం చుడుతున్నారు. అలాగే ఆగస్టు 8 తేదీకి మరో ప్రత్యేకత కూడా ఉంది. 'టాక్సిక్' షూటింగ్ ప్రారంభమై సరిగ్గా రెండేళ్లు పూర్తవుతున్న రోజునే ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు.

ఇప్పటివరకు పోస్టర్లు, గ్లింప్స్, పాటల ద్వారా మేకర్స్ సినిమా ప్రపంచాన్ని కొద్దికొద్దిగా పరిచయం చేస్తూ వచ్చారు. కానీ కథలోని అసలు మిస్టరీని మాత్రం బయటపెట్టలేదు. ఇప్పుడు విడుదల కానున్న ట్రైలర్‌తో 'టాక్సిక్' ప్రపంచం, ప్రధాన పాత్రలు, సినిమా స్కేల్, కథలోని అసలు కాన్ఫ్లిక్ట్‌ ను ప్రజెంట్ చేయనున్నారు.

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యష్ తో పాటు నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది.

కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మిస్తున్న 'టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్' చిత్రం ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu