Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీవీకే ఆధిక్యం.. విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత

టీవీకే ఆధిక్యం.. విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత

maa gulf 3 weeks ago

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాజకీయ అరంగేట్రం చేసిన తొలి ప్రయత్నంలోనే తమిళ సూపర్ స్టార్ విజయ్ పార్టీ (TVK) ప్రభంజనం సృష్టిస్తోంది.

టీవీకే ఏకంగా 100కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ అధికార పీఠం వైపు దూసుకుపోతోంది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ప్రధాన పార్టీలకు షాక్ ఇస్తూ, విజయ్ తన ప్రజాకర్షణతో ఓటర్లను విశేషంగా ఆకట్టుకున్నట్లు స్పష్టమవుతోంది.

టీవీకే పార్టీ ఘనవిజయం దిశగా సాగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. చెన్నైలోని విజయ్ నివాసం వద్దకు వేలాదిగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా విజయ్ ఇంటి పరిసరాల్లో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతానికి దారితీసే రహదారులను మూసివేసి, ఇతర వాహనాలను దారి మళ్లించారు. కేవలం పార్టీ ముఖ్య నేతలను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు.

తమిళనాడులోని మొత్తం 234 స్థానాల్లో టీవీకే సాధిస్తున్న ఈ ఫలితాలు భారత రాజకీయాల్లోనే హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించడమే కాకుండా, రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగారు. ప్రస్తుత ట్రెండ్స్ గనుక తుది ఫలితాలుగా మారితే, తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైనట్లేనని అభిప్రాయపడుతున్నారు.

కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా విజయ్ పొలిటికల్ ఎంట్రీపై చర్చ సాగుతోంది. రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఇంతటి ఆధిక్యాన్ని సాధించడం ఒక రికార్డు అని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. మధ్యాహ్నం సమయానికి పూర్తి స్థాయి ఫలితాలు వెలువడనుండటంతో ఉత్కంఠ నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu