Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉగ్రదాడిని ఖండించిన సౌదీ అరేబియా..!!

ఉగ్రదాడిని ఖండించిన సౌదీ అరేబియా..!!

maa gulf 2 days ago

రియాద్: చాడ్‌లోని ఒక సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ దాడిలో పలువురు భద్రతా సిబ్బంది మరణించడంతో పాటు మరికొందరు గాయపడ్డారని పేర్కొంది.

చాడ్ మరియు అక్కడి ప్రజల భద్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించే ఉగ్రవాద మరియు తీవ్రవాద చర్యలను సౌదీ అరేబియా తిరస్కరిస్తుందని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. ఈ విషాదకర సంఘటన నేపథ్యంలో చాడ్ ప్రభుత్వం మరియు ప్రజలకు తన సంఘీభావాన్ని, మద్దతును తెలియజేసింది. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu